Friday, November 22, 2024

నాటు వైద్యుడి ద‌గ్గ‌ర- చికిత్స చేయించుకుంటోన్న స్టార్ క్రికెట‌ర్ ధోని

ఒక్కొక్క‌రు అంతే..ఒక వ్య‌క్తి మీద న‌మ్మ‌కం క‌లిగిందో వారిని వ‌దిలిపెట్ట‌రు. అదే న‌మ్మ‌కంతో స్టార్ క్రికెట‌ర్ ధోని చెట్టుకింద కూర్చొని వైద్యం చేస్తోన్న వైద్యుడితో త‌న మోకాళ్ల నొప్పికి ట్రీట్ మెంట్ చేయించుకోవ‌డం వైర‌ల్ గా మారింది. ధోని రెండు మోకాళ్లలో నొప్పి వస్తోందంటూ ఒక నాటు వైద్యుడి దగ్గర చికిత్స తీసుకుంటున్నాడీ స్టార్ క్రికెటర్. రాంచీలో ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తుండే వందన్ సింగ్.. ఒక చెట్టు కింద కూర్చొని వైద్యం చేస్తుంటారు. ఆయన గురించి ధోనీ తల్లిదండ్రులకు ముందు నుంచి తెలుసట. వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి వైద్యం తీసుకునే వారని సమాచారం. ఈ విషయం తెలిసిన ధోనీ కూడా తన మోకాళ్ల నొప్పికి ట్రీట్‌మెంట్ కోసం వందన్ వద్దకే వస్తున్నాడు.పాలలో కొన్ని మూలికలు కలిపి తాగాలని వందన్ చెప్పినట్లు సమాచారం. నెలరోజుల క్రితం ధోనీకి తొలి డోస్ ఇవ్వగా.. మరుసటి డోస్ కోసం ఎప్పుడు వచ్చేదీ తనకు తెలియదని వందన్ వివరించారు. ధోనీ ఇంత పెద్ద స్టార్ అని తనకు తెలియదని, ఆ తర్వాత చాలా మంది చెప్పడంతోనే తెలిసిందని వెల్ల‌డించాడా వైద్యుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement