Tuesday, November 19, 2024

మాజీ సీఎంపై .. విచారణకు ఆర్డర్ జారీ చేసిన స్టాలిన్

గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కోల్పొయింది డీఎంకే..దేశంలో కొన్ని రాష్ట్రాలు సీఎం స్టాలిన్ ని రోల్ మోడల్ గా తీసుకుంటున్నాయి. ఇక తాజాగా ఈయన మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ షాక్ కు గురి చేశారు..గత ప్రభుత్వం సమయంలో అన్నాడీఎంకే పార్టీ తరపున సీఎం గా ఉన్న పళణిస్వామి పై విచారణకు ఆర్డర్ జారీ చేశారు. దీనికి కారణం పళణిస్వామి సీఎం గా ఉన్నపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాల కోసం కేటాయించిన బడ్జెట్ లో రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పళణిస్వామి నిజంగానే తప్పు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.దక్షిణాది రాష్ట్రం అయిన తమిళనాడులో ఒకప్పుడు రాజకీయాలు కేవలం జయలలిత చుట్టూనే తిరుగుతూ ఉండేవి. కానీ ఆమె మరణం అనంతరం పార్టీలో చీలికలు ఏర్పడి.. గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని డీఎంకే కు కోల్పోయారు. ప్రస్తుతం తమిళనాడు సీఎం గా స్టాలిన్ సుపరిపాలన అందిస్తూ అందరిచేత శబాష్ అనిపించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement