Sunday, November 24, 2024

ఐసిస్​ ఆరోపణలతో 2016లో అరెస్టైన నిందితుడికి ఊరట.. నిర్ధేషిగా తేల్చిన ఎన్​ఐఏ న్యాయస్థానం

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరేందుకు యువకులను ప్రేరేపించేలా బోధనలు చేస్తున్నారన్న ఆరోపణలపై 2016లో ఎన్​ఐఏ ఒకరిని అరెస్టు చేసింది. అప్పుడు అరెస్ట్​ అయిన జకీర్ నాయక్ నేతృత్వంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) ఉద్యోగిని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇవ్వాల (శుక్రవారం) నిర్దోషిగా ప్రకటించింది. ఐసిస్‌కు మద్దతిచ్చే, భారతదేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆర్షి ఖురేషీపై చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద అభియోగాలు మోపింది.

అయితే.. ప్రత్యేక NIA న్యాయమూర్తి ఏఎం పాటిల్.. ఖురేషీని అన్ని అభియోగాల నుండి నిర్దోషిగా ప్రకటించారు. వివరణాత్మక ఆర్డర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఐఎస్ఐఎస్ సభ్యుడు అష్ఫాక్ అదృశ్యమైన తర్వాత అతని తండ్రి ఫిర్యాదు మేరకు ఖురేషీతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు అష్ఫాక్‌ను ఖురేషీ ప్రేరేపించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement