నేటి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. సిల్వర్ రేట్లు కూడా నిలకడగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఆర్నమెంటల్ బంగారం ధర రూ.49,550 వద్ద, 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,060 వద్ద కొనసాగుతున్నాయి. 10 గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. వెండి రేటు కేజీకి రూ.74,200 వద్ద స్థిరంగా ఉంది. సిల్వర్ రేటు నిన్న క్షీణించిన విషయం తెలిసిందే. రూ. 200 మేర తగ్గింది. దీని కన్నా ముందు వెండి ధర Silver Price వరుసగా నాలుగు రోజులు పెరుగుతూనే వచ్చింది. దాదాపు రూ.3 వేల వరకు ర్యాలీ చేసింది. అంటే సిల్వర్ రేటు కేవలం 4 రోజుల్లోనే భారీగా పరుగులు పెట్టిందని భావించాలి. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బంగారం కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement