మానవపాడు మార్చి15(ప్రభన్యూస్) – శ్రీశైలం ఆనకట్ట నిర్మాణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 60కి పైగా గ్రామాలు మునిగిపోయాయి.అందులో ముఖ్యంగా కూడవెల్లి, ఉప్పలపాడు గ్రామాలు నాటి నుంచి నేటికీ బాధితులకు పరిహారం, పునరావాసం పూర్తి స్థాయిలో అందలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన ముంపు బాధితులకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఇండ్లు ఇస్తామని నాటి పాలకులు హామీనిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ బాధితుల తరపున మాట్లాడిన నాయకులు ఇప్పడు నోరు మెదపడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు ఇచ్చిన బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ పలువురు నాయకులు బాధితులకు మద్దతుగా మాట్లాడారు. కానీ ప్రత్యేకం రాష్ట్రం ఏర్పడినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పరిహారం కోసం వారు నిర్వాసితులు 30 ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
కూడవెల్లి,ఉప్పలపాడు గ్రామాలు సరిగ్గా 30సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ప్రాంతాల్లో గ్రామాలు ఉండేవి.అనటానికి చిహ్నంగా కొన్ని ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి. ఆగ్రామాలకు గుర్తుగా ఉన్న ఆనవాళ్లు ఆ గ్రామ చరిత్రకు అద్దం పడుతున్నాయి.అలంపూర్ మండలంలో 40 సంవత్సరాల క్రితం కనుమరుగైన కూడవెల్లి, ఉప్పలపాడు గ్రామాలు ఆ గ్రామంలో నివాసం ఉన్న వారి వంశస్తులు సమాచారం ఆధారంగా గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు గ్రామ చరిత్రను ఇప్పటికీ తెలియజేస్తున్నాయి.
అలంపూర్ కు సమీపంలో 2500 జనాభా కలిగిన విస్తీర్ణంలో కూడవెల్లి అనే గ్రామం ఉండేది. గ్రామంలో దాదాపుగా 300 కుటుంబాలు జీవనం సాగించేవారు. ఆ గ్రామంలో నివసించే అన్ని కులాలకు చెందిన వారు ఒకే కుటుంబంగా ఆత్మీయంగా ఉండేవారు.అక్కడి ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవించేవారు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న తుంగభద్ర, కృష్ణా రెండు నదుల కలయికతో కూడవెల్లి గ్రామం ఎంతో అద్భుతమైన దీవి లా ఉండేది. ఆ కాలంలో జొన్న, వేరుశనగ తదితర పంటలు ప్రధానంగా పండించేవారు.ఆ గ్రామస్తులు ప్రతి శివరాత్రికి భక్తిశ్రద్ధలతో సంగమేశ్వరుని పూజించేవారు.దీంతో పాటు దసరా, ఉగాది పండుగలను ఘనంగా జరుపుకునేవారని ప్రస్తుతం అక్కడ ఉన్న ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది.
శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణం తో గ్రామం మొత్తం ఖాళీ
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కూడవెల్లి, ఉప్పలపాడు గ్రామాలను 1981ఖాళీ చేయించారు.ఆగ్రామస్తులకు పునరవాసం కల్పించలేదు.
కూడవెల్లి ఆనవాళ్లుగా నిలిచిన అలంపూర్ లోని సంగమేశ్వర దేవాలయం:
40దశాబ్దాల క్రితం కూడవెల్లి గ్రామం కనుమరుగు కాగా గ్రామ ఆనవాళ్లుగా గ్రామంలో రచ్చబండ, శివాలయం,బురుజులు పునాదిరాళ్లు, గోడలు నిలిచాయి. గ్రామస్తుల దాహార్తి తీర్చే బావి పూడిపోయి అక్కడ బావి ఉండేదన్న గుర్తుగా నిలిచింది. ఇప్పటికే అక్కడ దర్గా జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఊరంతా కాలగర్భంలోకి..వెళ్లిన నేటికి ఒక రోజు గ్రామస్థులంతా తమ గ్రామ ఆలయం మైన సంగమేశ్వరుని సన్నిధిలో ప్రతి శివరాత్రికి అక్కడ కలుసుకుని కష్ట సుఖాలు తెల్చుకుంటారు.
30సంవత్సరాలుగా పునరావాసం కోసం…
శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడవెల్లి గ్రామాని ఖాళీ చేయించారు.68జీవో ప్రకారం గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులందరికి పునరవాసం కల్పించి,ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హమీ ఇచ్చారు.కాని అమలు చెయలేదు.ఇప్పటికి మాగ్రామస్తులు 76గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారు. మాపై దయతలచి ప్రభుత్వాలు స్పందించి మాగ్రామలకు పునరవాసం కల్పించాలి. – గోపాల్ రెడ్డి కూడవెల్లి గ్రామం