కాశ్మీర్ లోయ మీదుగా లడఖ్ వరకు సాగే ఎత్తైన పర్వత మార్గం జోజిలా. ఇది సముద్ర మట్టానికి 3528 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ రహదారి లడఖ్ ప్రజల మనుగడకు, ఆర్థిక అభివృద్ధికి అదేవిధంగా భద్రతా దళాలకు ఆయువుపట్టుగా ఉంది. ఈ హైవేను కొంతకాలంగా క్లోజ్ చేసి ఉంచారు. చలికాలంలో కురిసే మంచు.. భారీ హిమపాతం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఈ హైవేపై రాకపోకలు నిలిపేశారు.
కాగా, ఈ వ్యూహాత్మక శ్రీనగర్-లేహ్ హైవేపై ఇప్పుడు వాహనాల రాకపోకల కోసం తిరిగి ఓపెన్ చేసినట్టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జనవరి 5న భారీ హిమపాతం కారణంగా రహదారి మూసివేశామని, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కొంతకాలం పాటు ఓపెన్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.