దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. రికార్డ్స్ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల శ్రీలక్ష్మి కాంప్లెక్స్ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ప్రదర్శన తర్వాత ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాట ప్లే అవుతున్న సమయంలో సినిమా చూసిన మహిళలు స్క్రీన్ ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. గుంపుగా గుమిగూడి కోలాటామాడినట్లుగా డ్యాన్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్న థియేటర్లో ఈలలు కొడుతూ, కేరింతలతో చక్కగా టైం స్పెండ్ చేశారు. ఇదంతా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ పిక్చర్ ప్రదర్శితమవుతున్న ప్రతీ థియేటర్ లోనూ ఇటువంటి పరిస్థితే ఉంటుందని ఈ సందర్భంగా సినీ అభిమానులు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రజానీకం ఇలా టాకీసులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సెలబ్రేషన్స్ మామూలుగా ఉండటం లేదు. ఈ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజుతో సంబంధం ఉండటంతో పాటు ఇక్కడ మెగా అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉండటం ఓ కారణమని తెలుస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ లోని సాంగ్ కి డ్యాన్స్ చేసిన ‘మహిళలు’ – వైరల్ గా వీడియో
Advertisement
తాజా వార్తలు
Advertisement