Tuesday, November 26, 2024

భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణం.. కన్నుల పండువగా వేడుక

తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా, కన్నులపండుగగా జరుగుతోంది. భక్త శ్రీరామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లికొడుకుగా, సీతమ్మ పెండ్లికుమార్తెగా దర్శనమిచ్చారు. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది.  స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందించారు.

కాగా, సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ‍్యలో తరలివచ్చారు. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి తరించారు. రెండేండ్ల తర్వాత స్వామివారి కల్యాణానికి భక్తులను అనుమతించడంతో.. మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement