పొరుగు దేశమైన శ్రీలంకలో రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతున్నది. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక రంగం దెబ్బతినడంతో సంక్షోభం మరింత ఉధృతమవుతున్నది. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీలంక స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. 5.9 శాతం మేర కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ పతనమైంది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నిలిపివేశారు. ప్రధాన కంపెనీలు షేర్లన్నీ భారీగా నష్టపోయాయి. అరగంట పాటు ట్రేడింగ్‌ను నిలిపివేసినట్లు కొలంబో స్టాక్ ఎక్స్ఛేంజ్ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement