Friday, November 22, 2024

SriLanka Economic Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత..

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మంగళవారం అర్థరాత్రి దేశంపై విధించిన ఎమర్జెన్సీని రద్దు చేశారు. అల్లర్లను అరికట్టేందుకు భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు కల్పించిన ఎమర్జెన్సీ రూల్ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. నిరసనలు తీవ్ర రూపం దాల్చడం, మంత్రుల మూకుమ్మడి రాజీనామాలతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండడంతో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

మరోవైపు శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి నానాటికి మరింతగా దిగజారుతోంది. విద్యుత్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయి. దీంతో ప్రజలు రోడ్లపై వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్సే ఏప్రిల్ 1న ఎమర్జెన్సీని ప్రకటించారు. అనంతరం ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ , అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ నిరసనలు కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement