పేపర్లు కొనే స్థోమత లేక పరీక్షలనే రద్దు చేసిందా ప్రభుత్వం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం. పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్, ఇంక్‌ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితికి శ్రీలంక దిగజారింది. పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్‌లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తోంది. శ్రీలంక ఎడ్యుకేషన్ అధికారుల ప్రకారం.. 1948లో నుండి దేశంలో ఇంతటీ దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదని తెలిపారు. పేపర్ కొరత కారణంగా సోమవారం నుండి జరగాల్సిన ఇంటర్మ్ పరీక్షలు నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. అవసరమైన కాగితం, సిరాను దిగుమతి చేసుకోవడానికి దేశీయ ప్రింటర్లకు విదేశీ మారకద్రవ్య లోటు ఏర్పడిందని పశ్చిమ ప్రావిన్స్ విద్యా విభాగం నివేదించింది. సంవత్సరం చివరిలో టర్మ్ పరీక్షలు నిర్వహించాలా? లేదా? కేవలం గ్రేడింగ్ విధానంతో విద్యార్థులకు ప్రమోట్ చేయాలనే దాని గురించి కూడా చర్చించనున్నట్టు తెలిపింది. నిరంతర మూల్యాంకన ప్రక్రియలో భాగం.. దేశంలోని 4.5 మిలియన్ల విద్యార్థులలో మూడింట రెండు వంతుల విద్యార్థులకు మాత్రమే పరీక్షలను నిర్వహించగలదని నివేదించింది.
కరోనా కారణంగా.. శ్రీలంకలో టూరిజం చాలా దెబ్బతిన్నది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో శ్రీలంక పెట్రోలియం కార్పొరేషన్, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ బ్యాంకులకు ప్రభుత్వం 3.3 బిలియన్ డాలర్లు మేర చెల్లింపులకు బాకీ పడింది. అయితే ఫిబ్రవరి చివరి నాటికి శ్రీలంక విదేశీ కరెన్సీ నిల్వలు కేవలం 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇటీవలే భారత్ సైతం లంకకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. మరో 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నది. ఈ సంవత్సరం ప్రారంభంలో 22 మిలియన్ల మంది నగదు కొరత కొట్టుమిట్లాడుతున్నారు. దీంతో దక్షిణాసియా దేశాల ప్రధాన రుణదాతలలో ఒకరైన చైనాను రుణ చెల్లింపులను సహాయం చేయమని కోరింది, అయితే బీజింగ్ నుండి ఇంకా అధికారిక ప్రతిస్పందన లేదు. శ్రీలంక తన దిగజారుతున్న విదేశీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, బాహ్య నిల్వలను పెంచుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిలౌట్‌ను కోరుతుందని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..