Tuesday, November 26, 2024

Economic Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అధ్యక్షుడు రాజపక్సపై ప్రజాగ్రహం

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చిన ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. గురువారం రాత్రి రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు రాజపక్స నివాసాన్ని వేలాది మంది ముట్టించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి గొటబయా రాజపక్స తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 5 వేల మందికిపైగా నిరసనకారులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. అక్కడ ఉన్న ఓ బస్సు, పోలీస్ జీప్ సహా రెండు ద్విచక్రవాహనాలకు నిప్పంటించారు. మిర్హానా, న్యుగేగోడా వద్ద జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా 45 మందిని అరెస్ట్ చేశారు. 

కొలంబో శివార్లలో గుమిగూడిన వేలాది మంది నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగించారు. నిరసనలు తగ్గుముఖం పట్టకపోవడంతో రాజధాని శివారు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అత్యంత ఘోరమైన ఆర్థిక మాంద్యంతో పోరాడుతున్నందున వారాలపాటు ఆహారం, అవసరమైన వస్తువులు, ఇంధనం, గ్యాస్‌ల కొరత తీవ్రంగా ఉంది. గురువారం డీజిల్ అందుబాటులో లేదు. దేశంలోని 22 మిలియన్ల మంది ప్రజలు 13 గంటల విద్యుత్ బ్లాక్‌అవుట్‌లో ఉన్నారు. ఔషధాల కొరత కారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే శస్త్రచికిత్సలను నిలిచిపోయాయి. పెట్రోల్, డీజిల్ లేక రవాణా స్తంభించిపోయింది. సంక్షోభానికి భయపడి లంకేయులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్ టవర్స్‌‌పై ప్రభావం పడింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement