Friday, November 22, 2024

Falsh: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు రాజపక్స

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గెజిట్ జారీ చేశారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

గత కొన్ని రోజలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార పదార్థాల కొరత, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం అధ్యక్ష భవానాన్ని చుట్టుముట్టిన వేలాదిమంది ప్రజలను రాజపక్ష తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు హింసాత్మక ఘటనలు కూడా చేసుకున్నాయి.  ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్ష అత్యయిక స్థితిని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement