ఈ ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యూల్ మధ్య జరిగే సంభాషణ చూస్తుంటే లవ్ ఎఫైర్ లో వీరిద్దరూ చాలా దూరం వెళ్లిపోయారుగా అనే అనుమానం కలగక మానదు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ అనసూయ ఒక చిన్న గేమ్ పెడుతుంది. రాముడు, సీత అని రాసి ఉన్న స్లిప్స్ ని మిక్స్ చేసి ఉంచుతారు. ఈ గేమ్ లో పాల్గొనే వారు ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీసుకోవాలి. ఆ స్లిప్స్ లో రాముడు పేరు వచ్చిన వారు.. సీత పేరు ఉన్న స్లిప్ ఎవరి వద్ద కనిపెట్టాలి. రాముడు సీతని కనిపెడితే.. సీత చెంబుడు పానకం తాగాలి.. కనిపెట్టలేక పోతే రాముడే ఆ పని చేయాలి అని అనసూయ చెబుతుంది. అనుకోని విధంగా రాముడు స్లిప్ వర్ష కు వస్తుంది. సీత పేరున్న స్లిప్ ఇమ్మాన్యూల్ కి వస్తుంది. కానీ వర్ష.. ఇమ్మాన్యూల్ ని కనిపెట్టలేక పోతుంది. దీనితో నేనే సీత అంటూ వర్ష చేత పానకం తాగించేందుకు ఇమ్మాన్యూల్ ముందుకు వస్తాడు. స్లిప్ లో మాత్రమే నేను రాముడిని.. కానీ నిజానికి ఈయనే రాముడు, నేను సీత అని చెబుతుంది. అయితే కాళ్ళు పెట్టుకో ని ఇమ్మాన్యూల్ అంటాడు.. వర్ష సంప్రదాయంగా ఇమ్మాన్యూల్ కాళ్ళు మొక్కుతుంది. ఇమ్మాన్యూల్ వర్షని ఆశీర్వదించి కౌగిలించుకుంటాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన చూడ ముచ్చటగా ఉంది. వీరిద్దరూ ప్రేమలో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోయారు.. వ్యవహారం బాగా ముదిరింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement