మొస్సాద్ అనేది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ. ఇంటెలిజెన్స్ సేకరణ, రహస్య కార్యకలాపాల వంటి యాక్టివిటీస్ చేస్తుంది.. అంతేకాకుండా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మొసాద్ పూర్తిగా బాధ్యత వహిస్తుంది. దాని డైరెక్టర్ నేరుగా ప్రధానమంత్రికి మాత్రమే సమాధానం ఇస్తారు. అయితే.. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్ రూపొందించారు. ఇజ్రాయెల్‌పై అణుదాడి చేసి సర్వనాశనం చేయాలన్న ఇరాన్ కుట్రలను ఇజ్రాయెల్‌కు చెందిన గూఢచార సంస్థ మొస్సాద్ ఎలా చెక్ పెట్టింది. ఇరాన్ సర్వ సైన్యాధ్యక్షుడు మొహమ్మద్‌ని ఎలా మట్టుబెట్టారు అనే ఆసక్తికరమైన అంశాలతో ‘‘తెహ్రాన్”అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఆపిల్ టీవీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఫోన్ ఉన్న వారు తమ యాపిల్ ప్లస్ టీవీలో ఈ స్పై అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ని ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
తమర్ ఒక మొసాద్ హ్యాకర్. తమ దేశంపై దాడి చేసేందుకు అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్న ఇరాన్‌ని అణగదొక్కడానికి నకిలీ గుర్తింపుతో ఆ దేశం వెళ్తుంది. అయితే.. వారు చేపట్టిన మిషన్ ఎన్నో ప్రమాదాలతో కూడి ఉంటుంది. మొస్సాద్, మోయిస్ (ఇరానియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అధికారుల ఎత్తుగడలు.. ఒకరిని ఒకరు క్యాచ్ చేసుకునేందుకు వచ్చే సీన్లు అన్నీ చూపరులను టెన్షన్‌కి గురిచేస్తాయి. మరింత ఇంట్రెస్ట్‌ని పెంచుతాయి. చూసేవాళ్లలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి..
‘టెహ్రాన్’ మొదటి సీజన్ రిలీజ్ అయినప్పుడు వ్యూయర్స్ ఈ సిరీస్‌ని చూడటానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే చాలా వాటి మాదిరిగానే ఇది ఉంటుందని లైట్ తీసుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ బాగుందన్న మౌత్ టాక్ రావడంతో చాలామంది దీనిపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న టాప్ స్పై అండ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్‌లో టెహ్నాన్ సక్సెస్‌గా రన్ అవుతోంది. కాగా, రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత దీని రెండవ సీజన్ వచ్చింది. మొదటి సీజన్ ఎక్కడ ఆపేశారో… సెకండ్ సీజన్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లను రూపొందించారు.
ఇక.. ఈ వెబ్ సిరీస్‌లో తమర్ అనే క్యారెక్టర్ని నివ్ సుల్తాన్ అద్భుతంగా రాణించిందనే చెప్పుకోవాలి. ఆమె ఇరానియన్ లవర్ కమ్ సహకారి అయిన మిలాద్ తో కలిసి ఎన్నో సాహసాలు చేస్తుంది. ఈ సిరీస్ ప్రారంభంలో వారు ఇరాన్ ఏజెంట్లకు దొరక్కుండా దాక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. గత సీజన్‌లో ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ చేసిన పన్నాగం చివరి నిమిషంలో ఆగిపోతుంది. అప్పుడు పైలట్‌లలో ఒకరు తప్ప మిగిలిన వారంతా సేఫ్‌గా ఇంటికి చేరుకున్నారు.
అయితే ఒక్క పైలట్‌ని మాత్రం ఇరాన్ ఏజెంట్లు క్యాప్చర్ చేస్తారు. తనని ఓ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అయితే.. తమర్ తన ఇతర ఏజెంట్లతో కలిసి పైలట్‌ను ఇరాన్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రి నుండి రక్షించడానికి చేసిన ఎత్తుగడలు, అక్కడినుంచి తప్పించుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాగా, గ్లెన్ క్లోజ్ మానసిక విశ్లేషకురాలిగా ఎంటరైన మరో మొసాద్ గూఢచారిగా రివీల్ అవుతుంది. అదే ఆపరేషన్‌లో ఈమె పరిచయం అవుతుంది. ఆమె ఉనికి నిజంగా ఈ సిరీస్ మొత్తాన్ని మరింత హైలెవల్‌కి తీసుకెళ్తుంది. గ్లెన్ క్లోజ్ మొదటి ఎపిసోడ్ చివరిలో మార్జన్ మోంటాజెరిగా కనిపిస్తుంది. ఆమె ఇంగ్లీష్‌తో పాటు ఫార్సీని అనర్గళంగా మాట్లాడుతుంది.
రెండో ఎపిసోడ్లో వీక్షకులకు మార్జాన్ రోల్ బాగా ఉంటుంది. మొస్సాద్ తరపున ఇరాన్‌లోని విషయాలకు బాధ్యత వహించే వ్యక్తిగా ఆమెను ఫోకస్ అవుతుంది. మొస్సాద్ తరపున ఇరాన్‌లో కార్యకలాపాలకు కమాండ్‌గా ఉన్న మొసాద్ ఏజెంట్‌గా ఆమె ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి మొసాద్ ఏజెంట్లు ఎలా స్టెప్స్ తీసుకున్నారనేది చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది.
ఇది స్పై, థ్రిల్లర్స్ సీజన్.. యునైటెడ్ స్టేట్స్, యూరప్ వెలుపల సెట్ చేయబడిన స్పై, థ్రిల్లర్‌ను చూడటం కూడా రిఫ్రెష్‌గా ఉంది. CIA , MI5తో కంటెంట్ ఫర్మామెంట్ పరంగా చూస్తే.. మొస్సాద్, మోయిస్ ప్రధాన వేదికగా ఉండటం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
తమర్ క్యారెక్టర్లో నివ్ సుల్తాన్ అద్భుతంగా చేసిందనే చెప్పాలి. ఆమె హాస్పటల్ స్టంట్స్ లో అయినా లేదా డ్రగ్ డీలర్ బాబెక్ నుండి మిలాద్‌ను రక్షించడానికి చేసిన ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒక దశలో తనను తాను అర్పించుకుని ఊసరవెల్లిలా రంగులు మార్చడం ఇక్కడ చూడొచ్చు. అయితే.. ఇరాన్ ప్రధాన ఏజెంట్లలో ఒకరైనా ఫరాజ్‌ని మొస్సాద్ తనవైపు ఎలా తిప్పుకుంది అనేది కూడా ఈ వెబ్ సిరీస్‌లో చాలా అద్భుతంగా ఉంటుంది.చివరికి టెక్రాలజీని ఉపయోగించుకుని ఇరాన్ సైన్యాధ్యక్షుడైన మోహమద్ని, అతని కొడుకుని ఎలా చంపేస్తారన్నది తెలియాలంటే టెహ్రాన్ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాల్సిందే.
ఏఏ పాత్రల్లో ఎవరు నటించారంటే..
Niv Sultan as Tamar Rabinyan
Shaun Toub as Faraz Kamali
Menashe Noy as Meir Gorev
Shervin Alenabi as Milad
Navid Negahban as Masoud Tabrizi
Liraz Charhi as Yael Kadosh
Qais Khan as Mohammed Balochi
Sogand Sara Fakheri as Raziyeh Nekumard
Reza Diako as Shahin
Dan Mor as Eran