భారత్‌లో త్వరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉన్నా అవి డిమాండ్‌కు తగ్గ రీతిలో సరిపోవటం లేదు. ఈ దశలో రష్యా దేశం తయారు చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి భారత్ ఇప్పటికే అనుమతించింది. ఇప్పటికే కొన్ని లక్షల డోసులు రష్యా నుండి ఇండియా చేరగా… దేశీయంగా డా.రెడ్డీస్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనుంది. తాజాగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ధరను డా.రెడ్డీస్ ప్రకటించింది.
ఒక్కో డోసుకు రూ.955గా నిర్ణయించింది. ఈ ధర బహిరంగ మార్కెట్ ధర. ఇప్పటికే ఉన్న కోవాగ్జిన్ బహిరంగ మార్కెట్ ధర ఒక్కో డోసుకు రూ.900 కాగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రూ.1,200గా నిర్ణయించారు. వచ్చే వారం నుండి స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ భారత మార్కెట్‌లో వ్యాక్సినేషన్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ వ్యాక్సిన్ కూడా రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది.