Tuesday, November 26, 2024

కరోనా రోగి నుంచి వీర్యాన్ని తీసిన వైద్యులు..

కరోనా రోగి నుంచి వీర్యం సేకరించిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి నుంచి వీర్యం సేకరించారు..నా భర్త వీర్యాన్ని నాకు ఇప్పించండీ..ఆయన తిరగిరావచ్చు రాకపోవచ్చు కాని అతని పిల్లలకు నేను తల్లిగా ఉండాలని ఆశపడుతున్నా..కాబట్టి నా భర్త వీర్యాన్ని నాకు ఇప్పించండీ అంటూ ఓ భార్య కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఓ పక్క ఆమె భర్త ప్రాణాలతో పోరాడుతున్నాడు..మరోపక్క అతని భార్య నా భర్త వీర్యాన్ని నాకు కావాలి..ఇచ్చేలా చేయండీ సార్..అని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెకు అత్తమామలు కూడా అండగా నిలబడ్డారు.

వీర్య సేకరణకు వ్యక్తి అనుమతి అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియకు అనుమతి తెలిపే స్థితిలో రోగి లేనందున అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్‌ అశుతోశ్‌ జే శాస్త్రి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి నుంచి వీర్యం సేకరించినట్లు వైద్యులు తెలిపారు. కృత్రిమ పద్ధతిలో గర్భధారణ పొందేందుకు ఆమె తన భర్త వీర్యాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: వీడియో: నిండా మునిగిన చైనా..ఆగని వరదలు

Advertisement

తాజా వార్తలు

Advertisement