జర్మనీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతోంది. గత వారం నుంచి కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ వైద్యరంగంపై ఒత్తిడి పడుతోంది. ఒకే రోజు 39,676 కేసుల నమోదయ్యాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది. జర్మనీలో గత ఏడు రోజుల నుంచి ప్రతీ లక్షమందికి 232 శాతం వ్యాధి వ్యాప్తి రేటు ఉందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య 2,739కి చేరుకుంది. మరోవైపు యూరోపియన్ దేశాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుందని WHO ఇప్పటికే హెచ్చిరించింది. అందుకు అనుగుణంగానే జర్మనీ, బ్రిటన్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 2022 ఫిబ్రవరి నాటికి యూరోప్ దేశాల్లో కనీసం 5 లక్షల మరణాలైనా సంభవించే అవకాశం ఉందట.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily