Monday, November 18, 2024

నామినేష‌న్ వేసేందుకు – ప‌రుగుపెట్టిన క్రీడా మంత్రి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ నామినేష‌న్ ని దాఖ‌లు చేసేందుకు పరుగులు పెట్టారు. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఆయ‌న ప‌రుగులు పెట్టారు బాలియాలో ఉన్న క‌లెక్ట‌రేట్ ఆఫీస్ కు తొలుత నామినేష‌న్ వేయ‌డానికి ర్యాలీగా వెళ్లారు. ఆఫీసు గేటు వ‌ద్ద‌కు వ‌చ్చిన త‌ర్వాత నామినేష‌న్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. కేవ‌లం మూడు నిమిషాలు మిగిలి ఉండ‌టంతో మంత్రి గేటు నుండి ఆఫీసు నామినేష‌న్ హాల్ లోకి ప‌రుగులు పెట్టారు. డెడ్ లైన్ లోగా ఆఫీసుకు వెళ్లాల‌ని మంత్రి ర‌న్ చేశారు. బిజెపి టికెట్ పై ఆయ‌న ఫేపెనా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement