ఇండోనేషియా మాస్టర్స్ 2021 సెమీఫైనల్లో హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి చవిచూసింది. జపనీస్ టాప్ సీడ్ ప్లేయర్ అకేన్ యమగుచి చేతిలో సింధు పరాజయం పాలైంది. 13-21, 9-21 స్కోర్‌తో యమగుచి ఈజీగా సింధును ఓడించింది. కేవలం 32 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తైంది.
ఈ మ్యాచ్‌లో యమగూచి దూకుడు ముందు సింధు నిలువలేకపోయింది. వాస్తవానికి ఇద్దరి మధ్య గతంలో జరిగిన మ్యాచుల్లో సింధూదే పైచేయిగా ఉన్నా.. ఈరోజు మాత్రం యమగుచి ఆటతీరుకు సింధు తలవంచక తప్పలేదు. మూడో సీడ్ ప్లేయర్ అయిన సింధు ఇవాళ ఏ దశలోనూ తనదైన స్థాయిలో ఆటతీరు కనబరచలేదు. రెండు గేమ్‌ల్లోనూ ఆరంభం నుంచి వెనుకంజలోనే ఉంది.