పాలకూర మనం తినే ఆహారంలో తప్పనిసరి ఆకు కూరగా ఎంతో ప్రసిద్ధి చెందింది.. పాలకూర రుచికరమైనదే కాకుండా.. ఎంతో ఆరోగ్యమైనది అని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ పాలకూరకి మంచి డిమాండ్ ఉంది. ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలు కలిగి ఉండడమే దీని స్పెషాలిటీ. అలాగే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్ వంటివాటితో పాటు A, C & K, విటమిన్లు కలిగి ఉంటుంది. క్యారెట్ లో ఉండే సహజమైన బయోయాక్టివ్స్ కెరోటినాయిడ్స్, డైటరీ ఫైబర్ కూడా పాలకూరలో ఉంటుంది. పాలకూర పోషకాలకి “పవర్‌హౌస్ లాంటిదని డాక్టర్లు చెబుతుంటారు.
- మహిళలలో తక్కువగా ఉండే పోషకాలను పెంచేందుకు పాలకూర ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు డాక్టర్ రుక్సటన్. పాలకూరతో ఎముకల ఆరోగ్యం (కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ K), చర్మం, కంటి ఆరోగ్యం (విటమిన్ A, విటమిన్ సి, కెరోటినాయిడ్స్), పునరుత్పత్తి ఆరోగ్యం (ఫోలేట్) శక్తి స్థాయిలు (ఇనుము)కు సంబంధించినవి ఉంటాయి.
- పాలకూరలో సహజంగానే నైట్రేట్స్ ఉంటాయి.. నైట్రేట్స్ అనేవి గుండే జబ్బులు రాకుండా.. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగ పడతాయి. డాక్టర్లు కూడా నైట్రేట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే గుడే జబ్బుకు సంబంధించిన ఎలాంటి రోగాలు రావని ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
- పాలకూరలో జియాక్సంతిన్, లుటీన్ వంటి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి.. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటి రోగాలకి కారణమైన మాక్యులార్ డీజెనరేషన్, క్యాటరాక్ట్‌లను నిరోధించడానికి జియాక్సంతిన్, లుటీన్ పనిచేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital