Tuesday, November 26, 2024

ఇండియ‌న్ చిత్రాల‌పై హాలీవుడ్ సినిమాల హ‌వా : చెక్ పెట్టాల్సిందే

హాలీవుడ్ క్రేజీ చిత్రాల నిర్మాణ సంస్థ మార్వెల్ కి ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఉంది. మార్వెల్ నుండి వ‌చ్చే ప్ర‌తి సినిమాని ఇండియాలో రిలీజ్ చేస్తుంటారు. మార్వెల్ డిస్నీ వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ నిర్మాణ కంపనీల చిత్రాలకు భారతీయ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగా వాటిని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండ‌టంతో ఇండియా సినిమాలు గ‌ట్టి పోటీని ఎదుర్కొవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. రీసెంట్ గా స్పైడ‌ర్ మ్యాన్ : నో వే హోమ్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని వ‌సూలు చేయ‌డ‌మే కాదు ఇండియ‌న్ చిత్రాల మార్కెట్ పై పెద్ద దెబ్బ కొడుతుంది. క‌రెక్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప చిత్రం రిలీజ్ అయిన సంద‌ర్భంలోనే హాలీవుడ్ మూవీ రిలీజ్ కావ‌డంతో భార‌తీయ చిత్రాల మార్కెట్ ని దెబ్బ‌తీస్తున్నాయి హాలీవుడ్ చిత్రాలు.

ఇదే ఏడాది వచ్చిన షాంగ్ చీ ఎటర్నల్స్ దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 3.25 కోట్లు రూ. 8.75 కోట్లు వసూళ్లని రాబట్టాయి. ఈ సినిమాల సమయంలో విడుదలైన సూర్య‌వంశీ మొదటి రోజు రూ. 26.29 కోట్లను రాబట్టింది. గడిచిన రోజులని.. ఇంత వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన సినిమాలని పరిశీలించి చూస్తే హాలీవుడ్ చిత్రాలు సైలెంట్ గా మన ఇండియన్ సినిమాల‌ని న‌ష్ట‌ప‌రుస్తున్నాయ‌నే సంగ‌తి తెలుస్తుంది. మరి ఈ దాడి నుంచి మన భారతీయ సినిమాని కాపాడాలంటే డబ్బింగ్ చిత్రాలని కొంత వరకు కట్టడి చేయాల్సిందే అంటున్నారు మన సినీ ప్రియులు.. లేదంటే మన సినిమాల రిలీజ్ ల సమయంలో వాటిని రిలీజ్ చేయకుండా వాయిదా వేయాలని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో నిజం ఉంది కాబ‌ట్టి ఇండియ‌న్ చిత్రాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఒక నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌నే టాక్ వినిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement