Tuesday, November 26, 2024

నర్సన్న గుడికి ఎస్‌పీఎఫ్‌ భద్రత.. నిఘా నేత్రంలో యాదాద్రీశుని ఆలయం

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా కొలువైన ప్రధానాలయం, పరిసరాలలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) బృందంచే ఎల్లవేళలా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. శనివారం యాదగిరికొండ పైన జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఈవో ఎన్‌ గీత తదితరులు పాల్గొన్న ప్రభుత్వ శాఖల సమావేశంలో ఆయన పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ నుంచి బాలాలయంలో ప్రారంభంకానున్న యాగాలు, 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణతో మునిగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతినిత్యం యాగ, శ్రీ స్వామి వారి దర్శనార్థం అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా షీటీమ్స్‌, ట్రాఫిక్‌ తదితర పోలీసు విభాగాల బృందాలు యాదాద్రి పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తాయి. నిఘా నేత్రంలో యాదాద్రి దివ్యక్షేత్రం ఉంటుందని, ఇప్పటికే దేవస్థానం వారు 88 సీసీ కెమెరాలు సమకూర్చగా, పోలీసుశాఖ మరో 150 కెమెరాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

దర్శనార్థం గుడిలోకి వెళ్లే ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, భక్తుల లగేజీకి ప్రత్యేక స్కానర్లు వినియోగిస్తామని ఆయన వివరించారు. 28వ తేదీ మహాకుంభ సంప్రోక్షణకు ఒకరోజు ముందుగా భద్రత సిబ్బంది మోహరింపు పై ట్రాయల్‌ రన్‌ జరుపుతామని కూడా చెప్పారు. యాగం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల సమాచారాన్ని భక్తులకు ఏస్‌ సంస్థ అందిస్తుందని ఆయన చెప్పారు. చివరి ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణ జరిగే 28వ తేదీన, ఆ మరుసటి రోజు నుంచి భక్తుల తాకిడి రోజురోజుకు పెరగగలదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన కట్టుదిట్టమైన భద్రతకు పోలీసుశాఖ ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లకు శ్రీకారం చుడుతోంది.

తనిఖీలు ఎక్కడెక్కడ చేపట్టాలి
రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సమావేశం అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధమైన ప్రధానాలయం, మాఢ వీధులు, భక్తుల క్యూ కాంప్లెక్స్‌, బస్‌బే తదితర ప్రాంతాలలో కాలినడకన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, ఆలయ ఈవో ఎన్‌ గీత, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడి ్డ, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, వైటీడీఏ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఈఈ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement