Saturday, November 23, 2024

Big Story: ఒమిక్రాన్ కు స్పీడెక్కువ.. అంత డేంజర్ కాదు.. లంగ్స్ పై ఎఫెక్టు ఎట్లుంటది?

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అత్యంత స్పీడ్ గా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ తో జనాల్లో ఆందోళన ఎక్కువైంది. అయితే ఈ వేరియంట్ ప్రభావం ఏమిటి..  ఊపిరితిత్తులపై ఏ మేరకు ఉంటుందో చదివి తెలుసుకుందాం..

 కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇండియాలో రోజు రోజుకూ విస్తరిస్తూ పలు రాష్ట్రాల్లో కలవరం రేపుతోంది. దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. కాగా, దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రకటించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ సంక్రమణపై తీవ్రతపై చర్చ జరుగుతోంది.

మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమిస్తోందని డాక్టర్లు, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మనిషి శరీరం లోపల హ్యమన్ రెస్పిరేటరీ ట్రాక్ టిష్యూలో డెల్టా వేరియంట్‌తో పోలిస్టే  ఒమిక్రాన్ వైరస్70 రెట్లు వేగంగా రెట్టింపవుతుందట. హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చిన విషయమిది. అదే సమయంలో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే 48 గంటల అనంతరం పీక్స్ కు చేరుతుందని వెల్లడించారు పరిశోధకులు. 

 
ఇంత వేగంగా సంక్రమిస్తున్నా.. ఇంత వేగంగా మ్యూటేట్ అవుతున్నా కానీ, ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తుల్ని ఈ వేరియంట్ పెద్దగా నష్టం చేయదంటున్నారు. అమెరికా, జపాన్‌కు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం ప్రకారం కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయదు. ఇతర వేరియంట్లతో పోలిస్తే అంత ప్రమాదకరం కాదంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో 36 మ్యూటేషన్ల్ ఉన్నాయని ఇప్పటికే తేలింది. అయితే.. వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలో ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా లేదా అనేది ఇంకా కచ్చితంగా తెలియడం లేదు.

వ్యాక్సిన్ కలిగించే రోగ నిరోధకత నుంచి క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకుంటుందని తెలుస్తోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే. .ఒమిక్రాన్ 4 రెట్లు ఎక్కువ ఇన్‌‌‌ఫెక్ట్ చేస్తుంది. కరోనా వైరస్ ఒరిజినల్ వేరియంట్ లేదా డెల్టా వేరియంట్‌తో పోల్చి చూసినప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ సెల్స్ ను తక్కువగా ప్రభావితం చేస్తున్నట్టు అవగతమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తులపై కంటే గొంతుపై ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. సంక్రమణ వేగంగా ఉంటున్నందున కొవిడ్ సాధారణ వైరస్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరముందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement