Thursday, November 21, 2024

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష – లాక్ డౌన్ పై ఏం చెబుతారో

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభం అయింద‌ని నిపుణులు, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దాంతో కేంద్ర ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉన్న‌త‌స్థాయి స‌మీక్షని నిర్వ‌హించ‌నున్నారు. నేటి సాయంత్రం 4.30గంట‌ల‌కు సమీక్ష చేప‌ట్ట‌నున్నారు.కరోనాను ఎలా కట్టడి చేయాలి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం, లాక్‌ డౌన్‌ ప్రకటిస్తే జరిగే పరిణామాలు ఇలా అనేక అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. ఇక ప్రధాని మోడీ సమావేశం అనగానే.. లాక్‌ డౌన్‌ ప్రకటిస్తారేమోనని అందరూ భయపడిపోతున్నారు. కాగా…గడిచిన 24 గంటల్లో దేశంలో 1,59,632 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,90,611 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది.రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 10.21 కు చేరింది. మ‌రి లాక్ డౌన్ విష‌య‌మై ఏం చెబుతారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement