Sunday, November 17, 2024

షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ – ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి, తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 , 27 వ తేదీలలో షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ నెల 26 , 27 న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆడిటోరియం, మసాబ్ ట్యాంక్ హైద్రాబాదు లో తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రతి రోజు ఉదయం 10-30 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు కొనసాగుతాయని, శిక్షణ పూర్తి చేసిన జర్నలిస్టులకు సర్టిఫికేట్లను అందజేస్తారని ఆయన తెలిపారు. శిక్షణ తరగతులలో భాగంగా వృత్తి నైపుణ్యం పెంపొందించే విధంగా తెలంగాణ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని అన్నారు. శిక్షణకు హాజరయ్యే జర్నలిస్టులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని అన్నారు.
ఈ శిక్షణా తరగతులను జిల్లాలోని ఎస్సీ జర్నలిస్టులందరూ సద్వినియోగపర్చుకోవాలనిఆయన కోరారు.జిల్లా నుండి శిక్షణకు హాజరయ్యే ఔత్సహిక జర్నలిస్తులు ఈనెల 23 సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement