Tuesday, November 19, 2024

Special Story – వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ టిక్కెట్ల లొల్లి….ఆశావ‌హుల్లో టెన్ష‌న్.. టెన్ష‌న్

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు దగ్గరపడుతోంది. అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ నెల రోజుల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిం చడమే కాకుండా పార్టీ బీఫామ్‌లను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిం చారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుక పోతు న్నారు. కేంద్ర ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన రోజునే ఉమ్మడి జిల్లాలో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు, రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు భూపాలపల్లి, హన్మకొండ, మహబూబా బాద్‌ జిల్లాల్లోని భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజక వర్గాలలో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిం చారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈనెల 16న జనగామ అసెంబ్లి నియోజక వర్గంలో ఎన్నికల శంఖా రావాన్ని పూరించి విషయం తెలిసిందే. ఒకవైపున ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుక పోతుండగా కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా అభ్య ర్థులు ఎవరూ అనే విష యాన్ని తెల్చకుండా నాన్చ డంపై అశావాహులలో టెన్షన్‌ వాతావర ణం నెల కొన్నది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఏఐసిసి నేతలు రాహుల్‌ , ప్రియాంక అభ్యర్థులను ప్రక టించిన ములు గు, భూపాలపల్లి నియోజక వర్గాలలో బస్సు యాత్రను చేపట్టగా ఆయా³ నియోజక వర్గాల అభ్యర్థులతోపాటు కాంగ్రెస్‌ శ్రేణులలో సమరోత్సహాం కనిపించింది.

పొన్నాల రాజీనామాతో డైలమాలో పార్టీ నాయకత్వం
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీ నామా చేసి అధికార బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 45 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటు వంటి ఉద్దండుడికి పార్టీ అధిష్టానం టికెట్‌ కెటాయిం చలేదనే మనస్థాపంతోనే పొన్నాల కంటతడిపెట్టి పార్టీని వీడిపోవడంతో పార్టీలో ఉన్నటువంటి సీనియర్‌ నాయకు లు,ము ఖ్యంగా బి సి నేతలలో అంతర్మథనం మొదలైంది. జనగామ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో 2004 నుంచి 2014 వరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రిగా పని చేసిన సీనియర్‌ నాయకుడే పార్టీలో సరియైన ప్రాతి నిథ్యం లభించడంలేదని, పార్టీలోని సీనియర్‌ లతోపాటు కేంద్ర నాయ కత్వం కూడా నెల రోజులు ఉన్నా కనీసం అపా యింట్‌ మెంటు ఇవ్వకపోవ డం తోనే తీవ్రమైన మనస్థాపానికి గురైన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షం లో చేరారు. పొన్నాల చేరికతో బిసి నాయకత్వంతొ పాటు పార్టీ టికెట్‌ రావడం లేదనే అశావాహులందరుకూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.

బీసీలకు కేటాయింపు కోసమే ఆలస్యమా?
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లిd సీట్లను బిసిలకు కేటా యిం చాలనే ప్రతిపాద నను పార్టీలోని బిసి నాయ కత్వం పార్టీ అధిష్టానం ముందు ఉంచారు. తెలం గాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈలెక్కన 34 అసెంబ్లిd స్థానాలను బిసిలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తరువాత వాటిని 28 స్థానాలకు తగ్గకుండా కేటాయిం చాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రకటించిన నాలుగు స్థానాలలో రెండు జనరల్‌ స్థానాలు భూపాల పల్లి,నర్సంపేట ఉండగా ఒకటి ఎస్‌టి ములుగు, మరొకటి ఎస్‌సి స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే భూ పాలపల్లి నుంచి ఖారారు అయిన అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ నాయకుడిగా పనిచేశారు. 2018 ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల పొత్తులో భాగంగా భూపాల పల్లి స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించగా గండ్ర సత్యనారా యణరావు పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయిన విషయం తెలిసింది.

రేవంత్‌ రెడ్డి, సీతక్కతోపాటు మరికొంత మంది నాయకులు టిడిపి నుంచి 2018లోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీచే శారు. అయితే గండ్ర సత్యనారా యణరావు గత ఏడాది రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా అదే రోజున రేవంత్‌ రెడ్డి భూపాలపల్లి అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ పోటి కూడా లేకపోవడంతో ఆయన పేరును మొదటి జాబితా లో ఇచ్చారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లా నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పై నుంచి రేవంత్‌ రెడ్డి ములుగు అభ్యర్థి సీతక్కను, భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలని సభావేదికగా వారిద్దరి చేతులు పైకెత్తి పరిచయం చేస్తూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ తూర్పు నుంచి బిసి నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం ఖారారు కాబోతున్నది. అయితే ఆమెను తూ ర్పు నుంచి పోటీ చేయించాలా లేదా పరకాల నుంచి పోటి చేయించాలనే డైలమాలో పార్టీ అధిష్టానం ఉంది. ఇక్కడే మరో ట్విస్ట్‌ వచ్చింది. నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రకాశ్‌రెడ్డిని పరకాల నుంచి పోటి చేయించాలా..లేదా వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేయించాలా..లేకపోతే నర్సంపేట నుంచి బరిలో దింపాలనే సందిగ్ధతలో పార్టీ అధిష్టానం ఉంది.

- Advertisement -

పాలకుర్తి అభ్యర్థిత్వంపై టెన్షన్‌..టెన్షన్‌
పాలకుర్తి నియోజకవర్గంలో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే దయాకర్‌రావును ఓడించాలనే గట్టి పట్టుదలతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌ ఆలోచనలకు తగ్గట్టుగానే పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి ఎన్‌ఆర్‌ఐ అనుమాండ్ల ఝాన్సీరెడ్డి ముందుకు వచ్చారు. గత ఆరు మాసాలుగా ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చే స్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement