Friday, October 18, 2024

Special Story – నేత‌ల మ‌ధ్య అంత‌రం – జ‌నానికి దూరం

లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ హవా
ఎన్నడూ లేని రీతిలో 8 స్థానాల్లో విజయం
శ్రేణుల్లో జోష్‌… కానీ తర్వాత తగ్గిన జోరు
పార్టీలో పేరువెూసిన నేతలు ఎక్కువే
నడ్డా సభలో అంతరాల దొంతరలు తేటతెల్లం
సభ్యత్వ కార్యక్రమంలోనూ ఐక్యతలోపం
టీబీజేపీ నేతలు కళ్లు తెరిస్తేనే కమలవికాసం
లేనిపక్షంలో జనానికి మరింత దూరం
రాజకీయ విశ్లేషకుల అంచనా

తెలంగాణలో ఒకప్పుడు జంటనగరాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని స్థాయిలో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌తో సమఉజ్జీలా 8 స్థానాల్లో గెలిచింది. విపక్ష బీఆర్‌ఎస్‌ను మూడో స్థానానికి నెట్టేస్తూ నేనున్నా.. జాగ్రత్త అనే హెచ్చరికను సగర్వంగా పంపింది. కేంద్ర నాయకత్వమూ ఉబ్బితబ్బిబ్బయ్యింది. కార్యకర్తల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. కానీ ఆ తర్వాత ఆ జోష్‌ పాలపొంగులా చల్లబడిపోయింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. నాయకుల మధ్య ఉన్న సయోధ్య మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. కమలం కళ తప్పింది. ప్రజలకు దూరమైపోయింది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? మొదట్లో అన్నీతానై వ్యవహరించిన కేంద్రమంత్రి, రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి ఎందుకు మౌనరాగం ఆలపిస్తున్నారు. రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేగంగా కమలరథాన్ని నడిపిన బండి.. జోరు తగ్గడానికి కారణమేమిటి? ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈటెల పోటెత్తడం లేదెందుకు? ఎవరికివారే యమునాతీరే అన్నరీతిలో వ్యవహరిస్తున్నంతకాలం బీజేపీ ప్రజలకు దగ్గరవ్వడం అసాధ్యం. నిన్నగాక మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయానికి, అధికారం ఖాయమని భావించిన కాంగ్రెస్‌ పరాభవానికి కారణాలను రాష్ట్ర బీజేపీ నాయకులు విశ్లేషించాలి…

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఛార్జ్‌)


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కలహాల కాపురంగా మారిపోయింది. అగ్రనాయకుల మధ్య అభిజాత్య, ఆధిపత్య పోరు కమల వికాసానికి పెద్ద సమస్యగా మారిపోయింది. గత అసెంబ్లిd ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉద్యమించి… రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో మొదలైన తప్పటడుగులు ఇప్పటికీ కొనసాగు తున్నాయి. రాష్ట్రంలో బీజేపీకీ కావలసినంతమంది మేధావులు, వివిధ వర్గాలకు చెందిన పేరు ప్రఖ్యాతలు, ప్రజాదరణ ఉన్న నాయకులకు కొదవ లేదు. సుదీర్ఘకాలంగా పార్టీలో అన్నీతానైన కిషన్‌ రెడ్డి.. బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్‌, ధర్మపురి అరవింద్‌… వేరే పార్టీల నుంచి వచ్చినప్పటికీ.. జనాకర్షక శక్తి, ఉద్యమ నాయకత్వ అనుభవం, మంచి వాగ్ధాటి ఉన్న ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ వంటి నాయకులకు కొదువ లేదు. కానీ వారి మధ్య సఖ్యత లేదు. పార్టీలో మొదటినుంచి వచ్చినవారికి.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారికి మధ్య అంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

వీరంతా సమష్టిగా చేసిన కార్యక్రమాలు వేళ్లమీద లెక్కిం చవచ్చు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పికొట్టడంలో సమ ర్థమైన వ్యూహం అనుసరించడం లేదు. ఒకే అంశంపై పరస్పర విరు ద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు, శ్రేణులకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడాల్సిన వారు సొంత అంజెండాలతో అడుగులేస్తున్నారు. నాయకుల మధ్య అంత రాలు.. శ్రేణుల్లో గందరగోళానికి కారణమవుతున్నాయి. వారికి దిశానిర్దేశం చేయడంలో ఎవరిపంథాలో వారు వెడుతున్నారు. ఫలితంగా పార్టీ దెబ్బతింటోంది.

బలం తక్కువేమీ కాదు.. కానీ
బీజేపీని ఆదరించడంలో తెలంగాణ సమాజం తక్కువేమీ చేయలేదు. నిజానికి ప్రజలు ఆ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లిd ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీవైపే చూశారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించిన ఫలితం శ్రేణులను నీరుగారేలా చేసింది. ఆ ప్రభావం అసెంబ్లిd ఎన్నికల్లో కన్పించింది. దాదాపు అధి కారంలోకి వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవడమేకాక, మూడో స్థానానికే పరిమితమైపోయింది. దాంతో మేలుకున్న అధిష్ఠానం లోక్‌సభ ఎన్నికల నాటికి వ్యూహం మార్చింది.

ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకుంది. వారిని కలసికట్టుగా నడపగలిగింది. ఫలితంగా లోక్‌సభ ఎన్నికలనాటికి పుంజుకుంది. ఆ పార్టీకి 8 లోక్‌సభ స్థానాల్లో విజయం దక్కింది. తెలంగాణలో బీజేపీకి దక్కిన అతిపెద్ద ఫలితం ఇది. అంతేకాదు, ఆ పార్టీకి ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారిలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కింది. ఈటల, అరవింద్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సహా పలువురికి పార్లమెంటరీ కమిటీల్లో చోటు లభించింది. ప్రజలు, అధిష్టానం అండగా నిలిచినా… వారు ఎందుకు ప్రజల్లోకి చొచ్చుకుపోవడం లేదన్నదే ప్రశ్న. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ వ్యవహారాలలో గతానికి భిన్నంగా ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇటీవల మూసీ ప్రక్షాళన అంశంలో స్పందిస్తున్నప్పటికీ… నాయకుల వ్యాఖ్యల్లో వైరుధ్యం కన్పిస్తోంది. ప్రధాని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ తప్పుకా దుకానీ… మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును తప్పుపడతారా అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలను ఏ ఒక్కరూ ఇంతవరకు తిప్పికొట్టలేకపోయారు.

అందరూ కలసి మాట్లాడిన సందర్భాలు లేవు. 14 లక్షలమంది సభ్యులను చేర్చుకోవాలన్న బీజేపీ లక్ష్యంలో మూడోవంతు కూడా సాధించలేకపోవడానికి ఇదీ ఒక కారణం. ఇక లోక్‌సభ సభ్యుల పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. కేంద్రం నుంచి వారు రాష్ట్రానికి తెస్తున్న నిధులు, పథకాల వివరాలను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపడాన్ని, వరదసాయంగా తక్కువగా నిధులు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సొంత శ్రేణులుకూడా నిలదీస్తే జవాబిచ్చేవారు కన్పించడం లేదు. ఇటీవలి కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా రాష్ట్ర నేతలతో సమావేశం ఏర్పాటు- చేస్తే కొంతమంది ప్రజాప్రతినిధులు గైర్హాజరవడం ఇక్కడ గమనించాలి. అలాగే, కొద్ది రోజుల క్రితం బీజేఎల్పీలో ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. ఆ భేటీ-లో రైతు రుణమాఫీపై దీక్ష చేయాలని నిర్ణ యించారు. అందరూ ఓకే అన్నప్పటికీ ఆ కార్యక్రమం నాలుగుసార్లు వాయిదా పడింది. చివరకు దీక్ష చేసినా ప్రజాప్రతినిధుల్లొ కొందరు హాజరు కాలేదు. సీనియర్లు, కీలక నేతలు కూడా ఈ దీక్షకు మొహం చాటేశారు.

- Advertisement -

అదే సమయంలో ఇక పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధుల మధ్య కూడా గ్యాప్‌ పెరిగింది. పార్టీ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుని పలువురు పజాప్రతినిధులు వాపోతున్నారు. పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని.. తాము అందుబాటు-లో ఉన్నా పిలవడం లేదని ఆఎమ్మెల్యేలు, ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మౌనంగా ఉంటు న్నారన్నది ప్రశ్న. బీజేపీకి జాతీయ స్థాయిలో కూడా 2004, 2009లో ఇదే పరిస్థితి ఉండేది. మేధావులు, సమర్థులైన నాయకులుండేవారు. కానీ ఓట్లవేటలో చతికిలపడేవారు. జనాదరణ ఉన్నా విజయంగా మలుచుకోలేకపోయారు. కారణం అభి జాత్యం, ఆధిపత్య ధోరణి. అలాగే కులసమీకరణలను పట్టించుకుని రాజకీయ వ్యూహాలు రచిం చకపోవడం. వీటన్నింటికన్నా ముందు వారిలో ఐక్యత లేకపోవడం. వెరసి జోష్‌ లేకుండా, దిశాదశ లేకుండా కమలరథం కదలడం లేదు.

ఈ స్థితిలో రాష్ట్ర బీజేపీ నేతలు నేర్చుకునేందుగా అన్నట్టు హర్యానా ప్రజలు తీర్పు ఇచ్చారు. హర్యానాలో ఈసారి గట్టెక్కడం కష్టమేనన్న స్థితిలో ఏకంగా హ్యాట్రిక్‌ కొట్టింది. ఆ అద్భుతం ఎలా సాధ్యమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల నిరసనలు.. ఆ రాష్ట్రంలో ప్రబలశక్తిగా ఉన్న జాట్‌ సామాజికవర్గం దూరమవడం.. వంటి క్లిష్ట పరిస్థితుల్లో కమలం ఎలా వికసించింది? ఆ రహస్యం తెలంగాణ బీజేపీ నేతలు తెలుసుకుంటే… ఇక్కడా కమలం కళకళలాడుతుంది. నేర్వని పక్షంలో అధిష్ఠానమే ఆ పనిచేస్తుంది. హర్యానాలో చేసినట్టే. ఎన్నికలకుముందు ముఖ్యమంత్రి ఖట్టర్‌ను మార్చి.. ఓబీసీ వర్గానికి చెందిన నయాబ్‌సింగ్‌ సైనీని ముఖ్యమంత్రిగా చేసింది.

దశాబ్దాలుగా జాట్‌ల ప్రాబల్యంలో ఉన్న హర్యానా రాజకీయాల్లో కొత్త సమీకరణకు తెరలేపింది. ఆ రాష్ట్రంలో ఓబీసీ ఓటుబ్యాంక్‌ను కొల్లగొట్టి జాట్‌లకు చెక్‌ చెప్పింది. కాంగ్రెస్‌ను, ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించిన వా ర్తాసంస్థలను.. రాజకీయ పండితులకు అర్థంకాని వ్యూహాన్ని అమలు చేసింది. ఆ ఘనతను రాష్ట్ర బీజేపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి సాధి స్తారా? అధిష్ఠానం చేతులకు అప్పగిస్తారా? వేచి చూడాలి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ అధిష్ఠానం ఇక తెలంగాణపై దృష్టి సారిస్తుందనే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement