‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు… చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది” – హేమ
“శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.”
మలయాళం పరిశ్రమలో చేదు నిజాలు
లైంగిక దోపిడికి ఈ పరిశ్రమ చిరునామా
మహిళా ఆర్టిస్ట్ లకు నిత్య కష్టాలు
పడకకు వస్తే అందలం… లేకుంటే పాతాళం
15 మంది నిర్మాతల, దర్శకుల గుప్పిట్లో మాలీవుడ్
63 మంది హీరోలు, సహాయ హీరోలతో రాజ్యం
అవకాశం కావాలంటే వారికి అవకాశం ఇవ్వాల్సిందే
సినీ పరిశ్రమపై హేమ కమిటీ సంచలన నివేదిక
వాస్తవాలు వెలుగు చూడటంతో ప్రకంపనలు
సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను ఫేస్ చేస్తుంటారని బహిరంగ రహస్యం. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది. హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్థులతోనడపబడుతుందని, పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది.
జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలనాలు
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్… ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.
నివేదిక ప్రకారం, మహిళా నటీనటులను రాజీలు చేసుకోమని బలవంతం చేసేది దర్శకులు , నిర్మాతలు. అలాంటి డిమాండ్లను అంగీకరించే వారిని ‘సహకరించే కళాకారులు అని ముద్ర వేస్తారు. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని అని ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదల చేసిన నివేదిక పేర్కొంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్నప్పటికీ, ఈ నేరాలను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఈ నివేదిక తెలిపింది. ఈ చర్యలు సినీ పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా, నిరుత్సాహపరిచేలా, భయపెట్టేలా ఉన్నాయని హేమా కమిషన్ పేర్కొంది.
రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం.
ఇదీ నేపథ్యం
దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.
విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
కమిటీ నివేదికలో సంచలన విషయాలు
‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.
అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.
ఆ 15 మంది
కొంతమంది హీరోలు… మరికొంతమంది దర్శకులు… ఇంకొందరు నిర్మాతలు… ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. ఇక మాలీవుడ్ లో ఉన్న 63 మంది హీరోలు, సహాయ హీరోలు చేతులలోనే మహిళా అర్టిస్ట్ ల భవితవ్యం ఆధారపడి ఉంది.. ఆ జాబితాను నివేదిక లో ఇచ్చాం.. అయితే వారి పేర్లను బహిర్గతం చేయవద్దని కోరుతున్నాం అంటూ కమిషన్ ఛైర్మన్ హేమ ఆ రాష్ట్ర సిఎంను అభ్యర్ధించడం కొసమెరుపు
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే
సర్దుకుపోండి… రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు… కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.