అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎస్పీ పకీరప్ప తెలిపారు. నిఘా ముమ్మరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నెల రోజుల వ్యవధిలో 7,680 ఫ్యాక్సన్ గ్రామాలు, వార్డుల్లో, ప్రత్యేక సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 133 కార్డెన్సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో 671 బీట్లు నిర్వహణ, ఫ్యాక్సనిస్టులు,కిరాయి హంతకులు,బాంబులు, వేట కొడవళ్ల తయారీదారులు, రౌడీలు,హత్య కేసుల నిందితులు… ఇలా 2,147 మందిని చెక్ చేసి మంచిగా ఉండాలని కౌన్సెలింగ్ చేపట్టారు. మారణాయుధాలు, వేట కొడవళ్లు, పేలుడు పదార్థాలు,సామాగ్రి కోసం ఫ్యాక్షన్ గ్రామాలు , పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో 1,730 తనిఖీలు కొనసాగించారు. 1545విజుబుల్ పోలీసింగ్, ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..