Thursday, November 21, 2024

త్రివేణి సంగమంలో స్పెషల్​ అట్రాక్షన్​ ఎడ్ల బండి జర్నీ.. ఇంట్రెస్ట్ చూపుతున్న న‌గ‌ర వాసులు

భూపాలపల్లి, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో పది రోజులుగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి పుణ్యస్నానాలకు సకుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. పుష్కర ఘాట్ వద్ద పిండ ప్రదానం మొదలు స్నానాలకు వచ్చే వారికి గోదావరిలో స్పెష‌ల్ ఏర్పాట్లు చేశారు.

ఇసుకలో నడవ లేనివారి కోసం స్థానిక రైతులు ఎడ్ల బండి ఏర్పాటుచేసి పుష్కర ఘాట్ వద్దకు తరలిస్తూ కొంత‌మంది ఉపాధి పొందుతున్నారు. పట్టణాలనుండి వచ్చేవారికి ప్రత్యేక ఆకర్షణగా ఎడ్ల బండి జర్నీ నిలుస్తోంది. దీంతో ఎడ్లబండ్లు ఎక్కేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement