సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయన్ను వారం లేదా పది రోజుల పాటు ఫాంహౌస్‌లోనే ఉండాలని సలహా ఇచ్చామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు పేర్కొన్నారు. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఏదైనా అవసరమైతే హైదరాబాద్‌కు వస్తారన్నారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ నెల 14న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నోముల భగత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అటు మరో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి కూడా కరోనా సోకింది. కేసీఆర్‌కు కూడా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.