కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లా బాద్ మండలం నెమలి గ్రామంలో పర్యటించారు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వారితో కలిసి లైనులో నిలబడి ప్రార్థన చేశారు. స్పీకర్ పోచారం ప్రార్థన కోసం లైనులో నిలబడగా మరికొందరు అధికారులు కూడా అదే పని చేశారు. ప్రార్థన ముగిసిన అనంతరం ఆ పాఠశాలలో తొమ్మిది అదనపు తరగతి గదులను స్పీకర్ ప్రారంభించారు. ఈ గదులను రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయలతో నిర్మించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..