Friday, November 22, 2024

స్పేస్ ఎక్స్ ప్రయోగం సక్సెస్.. 105 చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఫాల్కన్ 9

అమెరికాకు చెందిన  స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఫాల్కన్9 తన 10వ యాత్రను కంప్లీట్ చేసింది. నిన్న 105 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి క్షేమంగా భూమిపైకి తిరిగి వచ్చిందని ఆ కంపెనీ వెల్లడించింది. కంపెనీకి చెందిన ట్రాన్స్ పోర్టర్3వ మిషన్‌లో భాగంగా.. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ నుండి 2-దశల ఫాల్కన్ 9 ప్రయోగం సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.  

ఫాల్కన్ 9 గత జనవరిలో ట్రాన్స్ పోర్టర్-1 మిషన్‌ను కూడా తీసుకువెళ్లింది. 2020లో కార్గో డ్రాగన్ క్యాప్సూల్‌నూ ప్రారంభించింది. ఈసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రభుత్వ, వాణిజ్య ఉపగ్రహాల్లో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 44 ఉపగ్రహాలున్నాయి. ఇవి భూమికి సంబంధించి రోజువారీ డేటాను అందించడానికి, భూమిపై ఉన్న ప్రతి భాగాన్ని ఇమేజింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement