Saturday, November 23, 2024

Space Walk: ఏ ఆస‌రా లేకుండా స్పేస్‌వాక్‌.. ఓ ఆస్ట్రోనాట్ అరుదైన ఫీట్‌!

అంత‌రిక్షానికి సంబంధించిన ఏ వార్త అయినా ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక ఆస్ట్రోనాట్స్ విష‌యంలో కానీ, అంత‌రిక్ష ప్ర‌యోగాల విష‌యానికి సంబంధించిన చాలా సినిమాలు ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ వ‌చ్చాయి. అయితే ఓ ఆస్ట్రోనాట్ ఎట్లాంటి క‌నెక్ట‌న్ లేకుండా అంత‌రిక్షంలో ఉండ‌డం అనేది మాత్రం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను క్యూరియాసిటీ అనే ట్విట్ట‌ర్‌లో సైన్స్ జ‌న‌ర‌ల్ వాళ్లు పోస్టు చేశారు.

సుమారు 40 ఏళ్ల క్రితం బ్రూస్ మెక్‌కాండెల్స్ II అనే వ్యోమగామి.. శాటిలైట్ రిపేర్ మిషన్‌ కోసం రిహార్సల్స్ చేస్తున్నాడ‌ని. దాని కోసం శాటిలైట్ వదిలేసి కనీసం స్పేష్ షిప్‌తో ఎట్లాంటి తాడు కానీ, మ‌రెలాంటి కనెక్షన్ లేకుండా.. అలా అంతరిక్షంలోకి వచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇలా కనీసం స్పేస్ క్రాఫ్ట్‌తో చిన్న కనెక్షన్ కూడా లేకుండా ఓ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేయడం ఇదే మొట్టమొదటి సారి అంటున్నారు.

https://twitter.com/Sciencenature14/status/1538720322869936129

ఇది.. 1984 ఫిబ్రవరిలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న బ్రూస్.. భూమి ఉపరితలానికి 170 మైళ్ల దూరంలో ఉన్నాడు. అంతేకాకాకుండా అత‌ను గంటకు 17,500 మైళ్ల వేగంతో భూమి చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్నాడు. కానీ, రోదసిలో ఉండే వర్చువల్ స్పేస్ వాక్యూమ్ కారణంగా అతనికి త‌ను భూమి చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ అస్స‌లు ఉండ‌దంటున్నారు సైంటిస్టులు.

దీనికి సంబంధించిన ఫొటోను ఇప్పుడు ఒక సైన్స్ ట్విట్టర్ హాండిల్ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు ‘‘ఇంత కన్నా భయంకరమైన స్పేస్ ఫొటోను ఇప్పటి వరకూ చూడలేదు’’ అని కొందరు కామెంట్ చేస్తుంటే ‘‘ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా వెళ్లిపోవాలనుకునే వాళ్లు ఇంతకన్నా దూరం వెళ్లలేరేమో’’ అంటూ ఇంకొంత‌మంది చ‌మ‌త్కారంగా రీ ట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/stevejetcity/status/1538990467211087872
Advertisement

తాజా వార్తలు

Advertisement