మొన్న రష్యా చేపట్టిన యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్టింగ్‌తో అంతరిక్షంలో 1500కు పైగా శిథిలాలు (డెబ్రిస్) పేరుకుపోయాయని ఇవి తమ ట్రాకింగ్‌లో కనిపించాయని అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ తెలిపింది. ఈ డెబ్రిస్ కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లోని ఆస్ర్టోనాట్స్ 90 నిమిషాలకోసారి తమ షెల్టర్ కంపార్టమెంట్లను క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్టు అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ పేర్కొంది.
ఈ సందర్భంగా యుఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. “రష్యా ఇంత రెక్‌లెస్‌గా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు. తన యాంటీ శాటిలైట్ క్షిపణిని నిర్లక్ష్యంగా పరీక్షించడంతోనే మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తోందో. దీన్ని తాము ఖండిస్తున్నాం. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనుగడకు ప్రమాదంగా మారుతుంది. ఈ ఘటనపై రష్యా ఇప్పటివరకు స్పందించలేదు” అన్నారు.
కాగా, అంతరిక్షంలో ఈ రోజు మార్నింగ్ స్పేస్ సెంటర్ కు సమీపంలో మేఘాలను తలపించే రీతిలో డెబ్రిస్ (శిథిలాలు) వెళ్లడం కనిపించిందని.. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆరియల్ దుహేమ్ రోస్ ట్వీట్ చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily