స్పేస్ లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. వీటిలో కొన్ని కాంతివంతమైన పల్సర్ జతలను కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ పల్సర్ జతలు కాస్మిక్ ఇన్ సైట్స్ తో గుంపుగా ఉన్నట్టు జర్మనీలోని బాన్‌లోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రేడియో ఆస్ట్రానమీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మైఖేల్ క్రామెర్, అతని సహచరులు వెల్లడించారు.
16 సంవత్సరాలుగా వీటి గురించి పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు శాస్త్రవేత్తలు. పల్సేట్‌గా కనిపించే న్యూట్రాన్ నక్షత్రాల జత పల్సర్‌లను వీరు చాలా కాలంగా గమనిస్తున్నారు. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, సాధారణ సాపేక్షత, కచ్చితత్వం వంటి మేజర్‌మెంట్స్‌ని ఇవి నిర్ధారించినట్టు తెలిపారు. సిద్ధాంతం యొక్క సూక్ష్మ ప్రభావాలను కూడా ఇవి సూచించాయన్నారు. డిసెంబర్ 13 న ఫిజికల్ రివ్యూ Xలో భౌతిక శాస్త్రవేత్తలు ఈ అంశాలను పబ్లిష్ చేశారు.
అయితే.. ఈ పల్సర్‌లు, దట్టంగా ప్యాక్ చేయబడిన న్యూట్రాన్‌లతో.. డెడ్ స్టార్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటాయని, వాటి లైట్‌హౌస్ లాంటి రేడియేషన్ కిరణాల కారణంగా క్రమమైన వ్యవధిలో భూమిపైకి రెప్పపాటు కాలంలోనే కనిపిస్తున్నట్టు వెల్లడించారు. వాటి కదలికల సమయ వ్యత్యాసాలు సాధారణ సాపేక్షత ప్రభావాలను బహిర్గతం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పల్సర్‌లను పుష్కలంగా కనుగొన్నప్పటికీ, ఒకదానికొకటి కక్ష్యలో ఉన్న ఒక జత మాత్రమే స్పెషల్‌గా కనిపిస్తుందని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. J0737-3039గా పిలువబడే డబుల్-పల్సర్ సిస్టమ్ యొక్క 2003 ఆవిష్కరణ, సాధారణ సాపేక్షతను పరీక్షించడానికి సాధ్యమయ్యే మార్గాల కొత్త ప్రపంచాన్ని తమకు చూపిందని వెల్లడించారు.
పల్సర్‌లలో ఒకటి సెకనుకు దాదాపు 44 సార్లు తిరుగుతుంది, మరొకటి ప్రతి 2.8 సెకన్లకు ఒకసారి తిరుగుతుంది. 2008లో నెమ్మదిగా పల్సర్ చీకటిగా మారింది, సాధారణ సాపేక్షత యొక్క వైచిత్రి కారణంగా దాని కిరణాలను వీక్షణకు దూరంగా ఉన్నాయి. కానీ, మిగిలిన కనిపించే పల్సర్‌ను పరిశోధకులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఆ కొత్త డేటాను పాత పరిశీలనలతో కలిపి వాటి కొలతల కచ్చితత్వాన్ని తెలుసుకుంటున్నారు.