Friday, November 22, 2024

పొలిటికల్​ రివేంజ్​.. సొంత బావతోపాటు అతని కుటుంబాన్ని 4 నెళ్లుగా బందించిన ఎమ్మెల్యే

ఉత్తర ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో ఓ ఎమ్మెల్యే తన సొంత బావతోపాటు అతని కుటుంబాన్ని నాలుగు నెలలుగా బందీగా ఉంచుకున్నాడు. ఇదంతా పొలిటికల్​ రివేంజ్​ కోసమనేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బస్తీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహేంద్ర నాథ్ యాదవ్.. బహదూర్‌పూర్ బ్లాక్ చీఫ్ రామ్‌కుమార్‌ను 4 నెలలకు పైగా తన ఇంట్లోనే బందీగా ఉంచుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న (శుక్రవారం) ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేసి రామ్‌కుమార్ తో పాటు అతని కుటుంబాన్ని కాపాడారు.

పోలీసుల దాడి సమయంలో ఎమ్మెల్యే తన ఇంట్లోనే ఉన్నారు. అక్టోబరు 23న బహదూర్‌పూర్‌ బ్లాక్‌ చీఫ్‌గా ఉన్న తన బావ రాంకుమార్‌ను సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేంద్రనాథ్ యాదవ్ తన ఇంట్లోనే బందించారని మిథాయ్ లాల్ కుమారుడు ఓం ప్రకాశ్ ఆరోపించడంతో యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత విచారణ చేపట్టిన పోలీసులకు.. సోదాల్లో రామ్‌కుమార్‌ ఆచూకీని ఎస్పీ ఎమ్మెల్యే ఇంట్లో గుర్తించారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రామ్‌కుమార్‌, అతని కుటుంబసభ్యులను విడిపించారు. నిందితులతోపాటు బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని బస్తీ ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. బాధితురాలికి పోలీసు రక్షణ కల్పించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement