Friday, November 22, 2024

Breaking: సమాజ్​వాదీ అధినేత ములాయంసింగ్​ యాదవ్​ హెల్త్​ సీరియస్​.. ఐసీయూలో చికిత్స!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ హెల్త్​ సీరియస్​గా ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు. 82 ఏళ్ల ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చాలా రోజుల నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. కానీ, ఆదివారం అతని పరిస్థితి విషమంగా మారడంతో కేర్ యూనిట్‌కు తరలించారు.

ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ సుశీలా కటారియా పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. యూరినరీ ఇన్ఫెక్షన్‌తో కూడా బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అతని రొటీన్ చెకప్ కూడా ఆ ఆసుపత్రిలోనే జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జులై నుంచి ములాయం సింగ్​ హెల్త్​ ఏమీ బాగుండడం లేదు. అప్పటి నుంచే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అట్లనే అతని కుమారుడు అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్ ఆసుపత్రికి చేరుకున్నారు. శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. ఇక.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సింగ్ ములాయం సింగ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, ప్రముఖ రాజకీయ వేత్త ములాయం సింగ్​ ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అతని హెల్త్​ బాగాలేదని తెలిసి తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ప్రియాంక అన్నారు. ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయ జీవితంలోకి రావాలని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement