Saturday, November 23, 2024

ఆ గాత్రం మధురం.. గాన గంధర్వుడికి ఘన నివాళి

గాన గంధర్వుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన విఖ్యాత గాయకుడు ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం తొలి వర్ధంతి నేడు. నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం ముగబోయింది. కరోనాతో గతేడాది సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు. మధురమైన గాత్రం, సంగీతంపై విశేషమైన పట్టున్న గాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం.. తెరపై కనిపించే నటులే పాడుతున్నారా? అనిపించేలా ఏ నటుడికి తగ్గట్లుగా ఆ నటుడికి గాత్రం మార్చి పాడడం బాలుకే సాధ్యం. దశాబ్దాల పాటు ప్రేక్షకులకు ఆయన పాటే మంత్రమైంది. తెలుగు, త‌మిళంతోపాటు క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌లతోపాటు మొత్తంగా 16కుపైగా భాష‌ల్లో ఆయ‌న పాటలు పాడారు. దాదాపు 40,000కుపైగా పాట‌లు పాడి ఆయ‌న గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. పాట‌లు పాడ‌టంతోపాటు కొన్ని సినిమాల‌కు ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. కొన్ని సినిమాల్లో న‌టించారు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.

ఇది కూడా చదవండిః దళితుల భూమి.. దర్జాగా కబ్జా..!

Advertisement

తాజా వార్తలు

Advertisement