దక్షిణ కొరియా ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షురాలు పార్క్ గున్‌హైకు క్షమాభిక్ష పెడుతున్నట్టు తెలిపింది. అవినీతికి పాల్పడిందంటూ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. న్యాయమంత్రిత శాఖ అన్ని కోణాల్లో ఆలోచించి.. క్షమాభిక్ష ప్రసాదించేందుకు నిర్ణయం తీసుకుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఒకటే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోంది. పార్క్ అవినీతికి వ్యతిరేకంగా దేశంలో కొన్ని నెలల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ఆమె తన పదవి నుంచి వైదొలిగారు. 2017లో ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉంటోంది.
దివంగత మాజీ అధ్యక్షుడు పార్క్ చుంగ్ కుమార్తెనే పార్క్ గున్‌హై. దేశ తొలి అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. అవినీతి, ఆరోపణలు రుజువు కావడంతో.. 24 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ.. అక్కడి న్యాయ స్థానం తీర్పు చెప్పింది. 18 అరబ్ వాన్‌లు జరిమానా కూడా విధించింది. అప్పట్లో.. కోర్టులో గున్‌హై విచారణను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ ్ట కోర్టు 66 ఏళ్ల పార్క్‌ను దోషిగా తేల్చింది. మార్చి , 2017 నుంచి ఆమె జైలు జీవితం అనుభవిస్తున్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి, లంచం తీసుకోవడం, హింస వంటి 16 రకాల అభియోగాలు నమోదయ్యాయి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆమె దుర్వినియోగం చేసినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్టు అప్పట్లో న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.