రైలు ప్రయాణికులకు ఇది తీపి కబురు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించిన రైల్వే శాఖ.. తాజాగా ప్యాసింజర్ రైళ్లను నడిపించనుంది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వేప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. ఆ మేరకు ప్రత్యేక ప్యాసింటర్ రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రేపల్లె-తెనాలి మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 13 తేదీ నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనుంది. కాచిగూడ – మిర్యాలగూడ, మిర్యాలగూడ-నడికుడి (మెము) ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 11 నుంచి నడపనున్నారు. నర్సాపూర్- విజయవాడ (డెము) మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 14 నుంచి తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రతి రోజూ నడపనున్నారు. కాచిగూడ – రొటిగావ్ మధ్య ఈ నెల 15 నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రతి రోజూ ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement