Monday, November 18, 2024

ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఒక కాన్పులో నలుగురు, ఐదుగురు పిల్లలు పుట్టారని వార్తలు అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు. అయితే, ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ గురించి విన్నారా? దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో ఒకే కాన్పులో అత్యంత ఎక్కువ మంది పిల్లలు పుట్టడం ఇదే తొలిసారి. దీనిని డాక్టర్లు ధృవీకరిస్తే ఇదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు.

గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ… 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా… ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రిటోరియాలోని ఆస్పత్రిలో సిజేరియన్ సెక్షన్‌లో జూన్ 7న పిల్లలకు జన్మనిచ్చింని ఆమె భర్త తెబోగో సోతెత్సీ తెలిపారు. డాక్టర్లు మొదట ఆమెను స్కాన్ చేసినప్పుడు… ఆరుగురు పిల్లలకు జన్మనిస్తుందని చెప్పారు. ఆ తర్వాత మరో సందర్భంలో పరీక్ష చేసినప్పుడు ఎనిమిది మంది పిల్లలకు జన్మనివ్వబోతోందని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రసవం సందర్భంగా మొత్తం 10 మంది పిల్లలకు జన్మనిచింది. అయితే ఒకేసారి ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం వైద్యులు సైతం ఆశ్యర్యపోయారు.

ఇదీ చదవండి: గుడ్ న్యూస్: రేషన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారా? కేబినెట్ నిర్ణయాలు ఇవే

Advertisement

తాజా వార్తలు

Advertisement