Friday, November 22, 2024

Smart Tech: ఇకమీదట ఫోన్లలో 200 చానల్స్​ చూడొచ్చు.. అదికూడా డేటా లేకుండానే!

త్వరలోనే ఎట్లాంటి డేటా అవసరం లేకుండానే స్మార్ట్​ఫోన్లలో 200 కంటే ఎక్కు వ చానల్​లను చూడొచ్చు. అంతేకాకుండా హై క్వాలిటీ వీడియోలను కూడా చూసే ఫెసిలిటీ ఉండబోతోంది. ఈ విషయాన్ని ఇవ్వాల (మంగళవారం) సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ముంబైలో ఫిక్కీ ఫ్రేమ్​ ఫాస్ట్​ ట్రాక్​ 2022 కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

భారత పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)- కాన్పూర్‌తో కలిసి 200 కంటే ఎక్కువ చానెల్‌లను మొబైల్ ఫోన్‌లలో ఎటువంటి డేటా లేకుండా నేరుగా ప్రసారాన్ని కల్పించే ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలిపారు. త్వరలోనే 5G రాబోతున్నందున డైరెక్ట్-టు-మొబైల్ ప్రసారానికి కూడా మరో అవకాశం ఉందని అన్నారు. ఇతర దేశాల కంటే డేటా ఇక్కడ చాలా ఛీప్​గా ఉన్నందున డేటా ఖర్చుల గురించి ఆలోచించచడం లేదని, ఇది మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.

రానున్న మూడు, నాలుగేళ్లలో ఇంకా పెద్ద పెద్ద మార్పులను వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. చాలా మంది ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను చూస్తున్నారు. అయితే కంటెంట్ సృష్టించే వారు కూడా పెరుగుతున్నారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడంలో నైపుణ్యం చాలా ముఖ్యమైన భాగం కాబట్టి మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ఇందులో పెద్ద పాత్ర పోషిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement