కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి నటుడు సోనూసూద్ అండగా నిలిచి నీరాజనాలు అందుకున్నాడు. కొందరు ప్రజల గుండెల్లో ఆయన దేవుడిలా కూడా మారాడంటే అతియోశక్తి కాదు. కానీ గురువారం నాడు సోనూసూద్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్‌లకు ఆగ్రహం తెప్పించింది. మహాశిరాత్రి సందర్భంగా శివుడి చిత్రాలను ఫార్వార్డ్ చేయడానికి బదులుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడండి అంటూ సోనూసూద్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు నెటిజన్లు సోనూని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. #WhoTheHellAreUSonuSood అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆయనపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో కొందరు ఈ రియల్ హీరోకు మద్దతుగానూ పోస్టులు పెడుతున్నారు. గతంలోనూ సోనూసూద్‌పై ఇలాంటి ట్రోలింగ్స్ భారీగానే జరిగాయి. కాగా తాజా ట్రోల్స్‌పై స్పందించిన సోనూసూద్ ‘నేను సామాన్యుడికి మాత్రమే.. జవాబుదారీగా ఉంటాను. మానవత్వంతో సాయం చేయడమే నా విధి’ అని పేర్కొన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement