Wednesday, November 20, 2024

ఇక మేం ఉండలేం.. కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసే యోచనలో సోనియా, రాహుల్​, ప్రియాంక!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాలు కాంగ్రెస్​ పార్టీకి చెంపపెట్టులా పరిణమించాయి. దీంతో ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఐదు రాష్ట్రాల ఘోర ప‌రాభ‌వం, జీ23 నేత‌ల డిమాండ్ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌నున్నట్లు స‌మాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వానికి త‌మ‌ను తాము బాధ్యులుగా ప్రక‌టించుకుంటూ.. రాజీనామాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వరగ్ఆల ద్వారా తెలుస్తోంది.

కాగా, ఆదివారం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక మండ‌లి సీడ‌బ్ల్యూసీ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ మీటింగ్​కు సోనియా గాంధీ అధ్యక్షత వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశం వేదిక‌గానే సోనియా, రాహుల్‌, ప్రియాంక రాజీనామాలను స‌మ‌ర్పించనున్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత కూడా ఇలాగే సోనియా, రాహుల్ రాజీనామా చేస్తామ‌ని ప్రక‌టించారు. అయితే సీడ‌బ్ల్యూసీ మాత్రం తిర‌స్కరించింది. మ‌రి ఈసారి ఏం జ‌రుగుతుందో చూడాలంటున్నారు పొలటికల్​ అనలిస్టులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement