సోనియా గాంధీకి కరోనా పాజిటివ్. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. గతంలో సోనియా గాంధీని కలిసిన చాలా మంది నాయకులు .. కార్యకర్తలు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు రణదీప్ సూర్జేవాలా తెలియజేశారు. సోనియా గాంధీకి నిన్న (బుధవారం) సాయంత్రం తేలికపాటి జ్వరం వచ్చింది, ఆ తర్వాత ఆమెకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. సోనియా గాంధీ ఐసలేషన్ లో ఉన్నారని సుర్జేవాలా అన్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. జూన్ 8లోపు సోనియా బాగుంటుందని సూర్జేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు.జూన్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను విచారణకు పిలిచింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో విచారణ జరగాల్సి ఉంది. సోనియా గాంధీ 2-3 రోజుల్లో కోలుకుంటారని ఆశిస్తున్నట్లు సూర్జేవాలా చెప్పారు.కాగా రాహుల్ గాంధీని గురువారం విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, రాహుల్ తేదీని మార్చాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మే 20 నుంచి 23 వరకు లండన్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రాలేదు. జూన్ 5 నాటికి అతను భారత్‌కు తిరిగి వస్తారని వార్తలు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement