భారతదేశపు అత్యున్నత ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్, దేశంలో సుప్రసిద్ధ ట్రాక్టర్ తయారీ సంస్థ సోనాలికా ట్రాక్టర్ రికార్డు నెలకొల్పింది. కేవలం 9 నెలల కాలంలో.. లక్షకు పైగా ట్రాక్టర్లను విక్రయించి ఔరా అనిపించింది. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ చక్కని వ్యూహాలు రచించడంలో ధిట్ట అని నిరూపించుకుంది. ఈ సందర్భంగా సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ మాట్లాడుతూ.. 9 నెలల కాలంలోనే అత్యంత ప్రతిష్టాత్మక 25వేల ట్రాక్టర్ల ఎగుమతి క్లబ్‌లో కూడా చేరింది. సోనాలికా ఇప్పుడు 3,432 ట్రాక్టర్ల ఎగుమతి విక్రయాల ద్వారా ఆధిపత్యం చూపడంతో పాటు డిసెంబర్ 2021లో 31.2 శాతం మార్కెట్ వాటాను సాధించింది. దగ్గర్లోని నెంబర్ 2 బ్రాండ్‌తో పోలిస్తే.. దాదాపు రెట్టింపు వృద్ధి ఇది.
మొత్తం మీద సోనాలికా ఏప్రిల్-డిసెంబర్ 2021 మధ్య కాలంలో 1,05,250 ట్రాక్టర్లను విక్రయించింది. తద్వారా అత్యంత వేగంగా లక్ష ట్రాక్టర్లను విక్రయించిన మార్కును అధిగమించింది. అత్యంత కఠినమైన కరోనా వేళ కూడా ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. ఇటీవలే విడుదల చేసిన సోనాలికా టైగర్ డీఐ 75 4 డబ్ల్యూ సీఆర్‌డీ ట్రాక్టర్ కూడా ఉంది. భారత్ నుంచి నెంబర్ 1 ఎగుమతి బ్రాండ్‌గా నిలబడటం సంతోషంగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో 25 వేల ట్రాక్టర్లను ఎగుమతి చేసింది.