తండ్రి అప్పులను కొడుకు తీర్చాల్సిందేనని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తంనెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం మరణించిన తండ్రి అప్పులను, ఆయన బాధ్యతలను తీర్చాల్సిన బాధ్యత కొడుకుదేనని తెలిపింది. భారమప్ప అనే వ్యక్తి వ్యాపారం, కుటుంబ అవసరాల నిమిత్తం 2003లో ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ. 2.60 లక్షలు రూ. 2 వడ్డీతో తీసుకున్నారు. ఆ అప్పును తీర్చకుండానే భారమప్ప మరణించాడు. దీంతో తన అప్పును తీర్చాలని భారమప్ప కొడుకు దినేశ్ ను ప్రసాద్ కోరగా… 2005లో రూ. 10 వేలు చెల్లించాడు. ఆ తర్వాత పలు దఫాలుగా చెక్కులు ఇచ్చాడు. అయితే, ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ఐసీడీఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్ అండ్ అన్ఆర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందేనని తీర్పునిచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement