Friday, November 22, 2024

Somu verraju: వాళ్లు లేకుండా ప్రభుత్వం లేదు.. ఉద్యోగులతో మాట్లాడండి

PRC జీవోను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగులను మళ్ళీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పనిచేయలేదన్నారు. రాష్ట్రంలో ఇంటి అద్దె పెరిగిపోయి, HRAను తగ్గించడంతో ఉద్యోగులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాకుండా ఎనిమి గవర్నమెంట్ గా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇలాంటీ నిర్ణయాలు చేయలేదన్నారు.
ఉద్యోగుల పక్షాన బీజేపీ పార్టీ అండగా నిలిచిందన్నారు. ఆత్మకూరులో జరిగిన ఘటనపై ముస్లిమ్ పట్ల హిందువు పట్ల ఓ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. హోమ్ మినిస్టర్ ఈ ఘటన పై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కార్యకర్తను రిమాండ్ చేశారన్న సోము.. ముస్లిం నాయకులను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.

శ్రీ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇంతవరకు అరెస్టు జరుగలేదన్నారు. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేస్తే వెంటనే అరెస్టు చేసారని ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిపై కేసులు ఎత్తేశారని అన్నారు. తాము ప్రశ్నిస్తే మతతత్వ పార్టీ అని ఆరోపిస్తున్నారని సోము మండిపడ్డారు. ప్రజా నిరసన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ముస్లింలో కూడా దేశ భక్తిని చాటేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement